KMM: బోనకల్ మండలంలో శనివారం ద్విచక్ర వాహనం నుంచి కిందపడడంతో మిషన్ భగీరథ ఉద్యోగి గోపి నరేష్(27)కు తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ ఫ్లైఓవర్ నుంచి రావినూతల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.