WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో తమ ప్రతిభను చాటుకున్నట్లు శుక్రవారం ప్రిన్సిపాల్ చారి తెలిపారు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, నైపుణ్యంతో పోటీలలో పాల్గొన్న విద్యార్థులు వివిధ స్థాయిలలో విజయం సాధించడం విశేషం. విద్యార్థుల ఈ అద్భుత విజయంపై పాఠశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.