WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గౌడ సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. సబ్బండ జాతులను ఏకం చేసి రాజ్యాధికారాన్ని స్థాపించిన బీసీ నాయకుడి విగ్రహాన్ని అడ్డుకోవడం బాధాకరమని తెలంగాణ గౌడ సంఘం నాయకులు యాదగిరి గౌడ్ విమర్శించారు.