NZB: వర్ని మండలం జలాల్పూర్ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక మొరం తరలిస్తే వాహనాలతో పాటు యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.