SRCL: రేపే వినాయక నిమజ్జనం కావడంతో తంగళ్ళపల్లిలోని వినాయకుల వద్ద పెద్ద ఎత్తున మహిళలు శుక్రవారం కుంకుమ పూజలు చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహించామని మండప నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.