SRPT: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి పంటలకు ఎకరానికి రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నూతనకల్ మండలం వెంకేపల్లిలో నష్టపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.