PDPL: శ్రీరాంపూర్ మండలం కూనారంలో విషాదం నెలకొంది. మధునయ్య (57) మేస్త్రి పని చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. ఈ ఏడాది వ్యవసాయ పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అప్పులు ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని భార్య స్వరూప తెలిపారు.