SDPT: సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువుపై బతుకమ్మ సందర్భంగా చేసిన ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం రాత్రి పరిశీలించారు. టూరిజం శాఖ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడారు. భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. మున్సిపల్, పోలీస్, టూరిజం శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.