SRD: మండలంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి సజావుగా జరిగిందని ఎంపీడీవో శారదా దేవి ప్రకటించారు. అయితే మండలంలోని చీమలపాడు గ్రామంలో 8వ వార్డు U/R మహిళకు కేటాయించగా సిద్ధమ్మ వేసిన నామినేషన్లో అదే వార్డుకు చెందిన ప్రతిపాదకుడు లేకపోవడంతో తిరస్కరించినట్లు చెప్పారు. మిగతా 225 వార్డు సభ్యుల నామినేషన్లు, 28 జీపీలకు 146 సర్పంచ్ నామినేషన్లు సరిగ్గా ఉన్నాయి.