SRPT: కోదాడ పట్టణంలో బుధవారం పోలీసులు మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేపట్టి 10 మంది మైనర్లను గుర్తించారు. వారి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు దారితీస్తుందని, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శివశంకర్ హెచ్చరించారు.