ADB: జిల్లాలో గృహ అవసరాల కోసం అందిస్తున్న LPG గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, గృహ వినియోగ సిలిండర్ ను ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.