HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ కొత్తకొండేశ్వర స్వామి జాతర సందర్భంగా దుకాణాలు, స్టాల్స్, పార్కింగ్ లైసెన్సుల కేటాయింపుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ EO కిషన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు దేవస్థానం ఆవరణలో జరుగుతుందని, ఆసక్తిగల వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.