KNR: బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం ఆయన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య అధికారులతో కలిసి నగరంలోని పలు నిమజ్జన పాయింట్లను సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.