NLG: ప్రతి వాహన దారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ద్విచక్ర వాహన దారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. “అలైవ్ -అరైవ్” కార్యక్రమంలో భాగంగా గురువారం ఎస్సై హెల్మెట్ ధరించి, స్థానిక యువతతో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు గాయాలు ఎక్కువగా జరిగే అవకాశముందని, హెల్మెట్ ధరించాలని కోరారు.