MHBD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు కుంజా సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.