PDPL: రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులు 2.14 కోట్లతో నిర్మించిన ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సోమవారం సాయంత్రం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. 160 మంది విద్యార్థినులకు అందుబాటులోకి రానున్న ఈ భవనంలో ఫర్నిచర్, వాటర్ ప్యూరిఫయర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ నూతన భవనాన్ని ప్రారంభిస్తామన్నారు.