MBNR: విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాలలో విజయం తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు పనులు చేసేవారి ఆలోచనలను అమ్మవారు తుడిచేయాలని పేర్కొన్నారు.