PDPL: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి బుధవారం 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. ముఖ్య అతిథులుగా ఆర్జీ 1 జీఎం డీ. లలిత్ కుమార్ అనిత దంపతులు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పించారు. ప్రతి ఒక్కరిపై గణనాథుడి కృపాకటాక్షలుండాలని స్వామివారిని ఈ సందర్భంగా వేడుకున్నారు.