మెదక్లో వ్యవసాయ భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో మెయింటెనెన్స్ కారణంగా సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. నేటి నుంచి విలువలు పెరగనున్నందున ఇప్పటికే బుక్ చేసుకున్నవారు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూభారతి సైట్ కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.