SRPT: సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ బోధించే స్కూల్ అసిస్టెంట్ మారం పవిత్ర, శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఆమె తెలంగాణ రాష్ట్ర స్థాయిలో సైన్స్ రిసోర్స్ పర్సన్‌గా విశిష్ట సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును ప్రదానం చేశారు.