JGL: కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లో ఆవును పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. పులి కథలాపూర్ మండలం తుర్తి అటవీ ప్రాంతం నుంచి కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లోకి వెళ్లినట్టు పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూరంపేట అడవిలో పులి ఆవును చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.