MLG: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బుధవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.