NRML: ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో నిర్మల్‌కు చెందిన శ్వేత కువైట్‌లో చిక్కుకుపోయారు. ఇంట్లో శుభకార్యానికి వచ్చే వీలు లేకపోవడంతో కుటుంబీకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే విదేశాంగ శాఖ అధికారులతో చర్చించి ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు.