MLG: ఏటూరునాగారం మండలం పరిధిలోని కొండాయి గ్రామంలో ఆరేళ్లపాటు పంచాయతీ కార్యదర్శిగా సేవలందించిన సతీష్ బదిలీపై వెళ్తుండడంతో శుక్రవారం గ్రామాభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. వరదల సమయంలో కుటుంబాన్ని పక్కనబెట్టి రాత్రింబవళ్లు పనిచేసి ప్రజలకు అండగా నిలిచిన సతీష్‌కు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.