హైదరాబాద్లో ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా ఉష్ణోగ్రత 38°C, కనిష్ఠంగా 25°C వరకు ఉండనుందని పేర్కొంది.