KMM: లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె. చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డట్టు డీఎస్పీ వై. రమేష్ తెలిపారు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట రూ. 1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ. 15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డు వద్ద లంచం తీసుకుంటుండగా సోమవారం పట్టుకున్నారు.