MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (MPUPS)లో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి.. పాఠశాల బాధ్యతలను స్వీకరించి తమదైన శైలిలో రాణించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో ముస్తాబై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.