KMR: బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో, ఆదివారం దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.