KNR: దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేసిన గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.