MLG: వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం నీటిధారలతో కనువిందు చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఎగువ నుంచి వరద జలపాతానికి చేరుతోంది. మూడు నెలలుగా బోసిపోయిన జలపాతం నీటి సవ్వడులతో, పచ్చని వాతావరణంలో కొత్త అందాలతో పర్యటకులను ఆకర్షిస్తోంది.