MNCL: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆదివారం 2 బైకులు ఢీకొన్న ఘటనలో శ్రీకాంత్, మురళి అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. నస్పూర్ 108 సిబ్బంది EMT రాకేశ్, పైలట్ అరవింద్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితులను మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.