హన్మకొండ జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో ముగ్గురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ నుంచి బి. కిరణ్ కుమార్, కామారెడ్డి నుంచి ఆర్. నాగలక్ష్మి, ఖమ్మం నుంచి వెంకటరమణ బదిలీపై వచ్చి కొత్తగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.