SDPT: తనలో శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ‘రంజాన్ తోఫా’లను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ పాలనలో ముస్లిం మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత దక్కిందని, ఇమామ్లకు గౌరవ వేతనం, షాదీ ముబారక్ పథకాలు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు.