SRPT: కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో జిల్లాలోనే తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. కోదాడ రైతు తిరుమల వెంకటయ్యకు చెందిన గేద దూడ కాలికి ఆటో తగిలి చర్మం ఊడిపోయింది. మంగళవారం వైద్యశాలకు తీసుకురాగా, డాక్టర్ పెంటయ్య చేప చర్మంతో గ్రాఫ్టింగ్ చేసి విజయవంతంగా చికిత్స అందించారు. ఈ క్లిష్టమైన సర్జరీ ద్వారా దూడ ప్రాణాలను కాపాడారు.