HYD: ‘iBOMMAతో పైరసీ ఆగుతుందా’ అని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “ఒక నేరగాడు పోతే మరొకడు వస్తాడు. నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. నివారణ ఒక్కటే మన చేతిలో ఉంది” అని ఆయన చెప్పారు. తక్షణమే డబ్బు సంపాదించాలనే ఆశే ఈ నేరాలకు మూల కారణమని, దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు ట్విట్ చేశారు.