BDK: ఇల్లందు మండల పర్యటనలో భాగంగా బొజ్జ గూడెం గ్రామంకు చెందిన మొగిలి నాగయ్య గుండెపోటుతో మరణించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నాగయ్య పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఆపద వచ్చినా తమ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.