SRCL: ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.