హన్మకొండ జిల్లా కేంద్రంలోని JNS స్టేడియంలో తాత్కాలికంగా క్రీడా పాఠశాలను నవంబర్ 14, 2025 నాటికి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు స్టేడియంలోనే కొనసాగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి 4వ తరగతి బాలురు 40 మంది, బాలికలు 40 మందిని కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు.