BHNG: చౌటుప్పల్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డుకు కేటాయించిన రూ.6 వేల కోట్లను వెంటనే జమ చేయాలని కోరారు. కేంద్రం తీసుకొస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వ్యతిరేకించాలన్నారు.