NLG: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) వేడుకలను పురస్కరించుకుని నల్గొండలో పండుగ వాతావరణం సంతరించుకుంది. సంబరాల్లో భాగంగా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నల్గొండ జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ భవనాన్ని, మున్సిపల్ ఆఫీసు రంగురంగుల ఎల్ఈడీ లైట్లతో సుందరంగా తీర్చిదిద్దారు.