MBNR: చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు.