HYD: గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని, పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC అధికారులు, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.