BDK: దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన రవికుమార్, చెన్నారావు ఆర్థిక సహాయంతో ప్రాథమిక పాఠశాలకు ఆట వస్తువులు, టీవీ తదితర సామాగ్రిని అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని వస్తువులను ఆవిష్కరించి పాఠశాలకు అందజేశారు. అనంతరం దాతలను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.