SRCL: జనవరి 1 నుంచి ఆన్లైన్ ద్వారా అధికారులు సెలవు దరఖాస్తులు సమర్పించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో e- HRM పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తుల నమోదుపై ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.