MLG: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కుతుబుద్దీన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. సామరస్యం, పరస్పర గౌరవం, ఐక్యతతో అందరూ జీవించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.