JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాలల టీజీఎంఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై ఉపాధ్యాయులు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.