NRPT: ప్రజల సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అవలంబిస్తూ, ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకుంటున్నారని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలకు ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.