GDWL: ఏప్రిల్ 14 నాటికి సంపూర్ణత అభియాన్లోని 6 ముఖ్య ఇండికేటర్ల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని గట్టు తహసీల్దార్ విజయ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చెన్నయ్య అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ద్వారానే వంద శాతం ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.