NLG: నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. మొదటి రోజు శుక్రవారం మొత్తం 340 మంది విద్యా ర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు కళాశాల కోఆర్డినేటర్ సీహెచ్. నరసింహారావు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.