MBNR: బాలానగర్ మండల కేంద్రంలో రేపు ఉదయం 11 గంటలకు మండల లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా లంబాడ పోరాట హక్కుల సమితి అధ్యక్షుడు శివకుమార్ నాయక్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మండల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని వివిధ తండాలకు చెందిన గిరిజన యువకులు పార్టీలకు అతీతంగా హాజరు కావాలన్నారు.